పేటీఎం గుడ్ న్యూస్..రూ.4 పంపిస్తే రూ.100 క్యాష్‌బ్యాక్..! ఎలా చేయాలంటే?

0
133

పేటీఎం గుడ్ న్యూస్. కస్టమర్లను ఆకర్షించే విదంగా యుపిఐ సంస్థ అయిన పేటీఎం ఒక కొత్త ఆఫర్ ని తీసుకు వచ్చింది.అదేంటంటే 4 కా 100 క్యాష్ బ్యాక్ పేరుతో మరికొత్త ఆఫర్ ను మన ముందుకు తీసుకువచ్చింది. ఈ ఆఫర్  ప్రకారం పేటీఎం యాజర్లు కేవలం 4 రూపాయలు పంపిస్తే ఏకంగా 100 రూపాయలు మన అకౌంట్ లోకి వచ్చి పడతాయి. మీరు సింపుల్‌గా పేటీఎం యూపీఐ ఆప్షన్ ద్వారా డబ్బులు పంపితే చాలు. మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ ఆఫర్ ని పేటీఎం ఇండియా వెర్సెస్ వెస్టిండీస్ వన్‌డే, టీ20 మ్యాచుల సందర్భంగా తీసుకు వచ్చింది.

ఈ అవకాశం ఫిబ్రవరి 20 వరకు కూడా వుంది. మ్యాచ్ జరిగే రోజు యూజర్లు ఈ ఆఫర్ ని వాడచ్చని అంది. ఈ ఆఫర్ ని 4 కా 100 క్యాష్‌బ్యాక్ పేరు తో తీసుకొచ్చారు. దీనితో రూ. 100 వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. అయితే ఈ ఆఫర్ కేవలం కొత్త యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఏ మొబైల్ నెంబర్‌కు అయినా రూ. 4 మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తే చాలు క్యాష్ బ్యాక్ వస్తుంది. యూజర్లు రెఫరెల్ ప్రోగ్రామ్‌లో పాల్గొని అదనపు క్యాష్‌బ్యాక్‌ను సొంతం చేసుకోవచ్చు.

ఇది ఇలా ఉంటే పేటీఎం యూపీఐ ద్వారా సూపర్ ‌ఫాస్ట్‌గా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయొచ్చని కంపెనీ అంది. అలానే ఈ సూపర్ ఆఫర్ ని యూజర్ల కోసం ప్రత్యేకించి క్రికెట్ సీజన్‌లో తీసుకు వచ్చామని చెప్పారు. దీనితో కేవలం నాలుగే రూపాయిలు పంపి రూ. 100 వరకు క్యాష్‌బ్యాక్ ని పొందొచ్చు. యాప్ లో యూజర్లు పేటీఎం యూపీఐ సర్వీసులను యాక్టివేట్ చేసుకోవాల్సి వుంది. ఆ తరవాత డబ్బులు పంపాలి. యూపీఐ ద్వారా ఇతరులకు ఫోన్‌పే, గూగుల్ పే, అమెజాన్ పే వంటి వాటి ద్వారా కూడా పంపచ్చు.