సామాన్యులకు భారీ షాక్..మళ్లీ పెరగనున్న గ్యాస్ సిలిండర్ ధర!

Huge shock to the common man .. Gas cylinder price to rise again!

0
56

సామాన్యులకు బారి షాక్ ఇచ్చిన గ్యాస్ సిలిండర్ ధరలు. ఎందుకంటే సిలిండర్ ధర మరోసారి పెరుగనున్నట్టు  కనపడుతోంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర మళ్లీపెరుగనున్నట్టు తెలుస్తుంది. రానున్న రోజుల్లో సిలిండర్ ధర భారీగా పెరగచ్చని అంటున్నారు. ఎందుకంటే ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత సిలిండర్ ధర భారీగా పెరగొచ్చని అంటున్నారు. ఇదే కనుక జరిగితే సామాన్యులకి మరెంతో కష్టం అవుతుంది.

2021 అక్టోబర్ 6 నుంచి ధర స్థిరంగానే వుంది. ధరలలో ఎలాంటి మార్పు రాలేదు. ఇది ఇలా ఉంటే మార్చి 10 తర్వాత గ్యాస్ సిలిండర్ ధర రూ.100కు పైగా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే కనుక జరిగితే సామాన్యులపై ఎఫెక్ట్ పడుతుంది. 2021 అక్టోబర్ నుంచి 2022 ఫిబ్రవరి 1 వరకు చూస్తే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.170 పైకి చేరింది.

అక్టోబర్ 1న ఈ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.1736 వద్ద ఉండేది. ఇక నవంబర్‌ కి వచ్చే సరికి రేటు రూ.2 వేలకు చేరింది. అదే డిసెంబర్‌లో అయితే రూ.2101కు వెళ్ళింది. ఇక జనవరి, ఫిబ్రవరి నెలల్లో ధర తగ్గింది. ఇప్పుడు ఈ సిలిండర్ ధర రూ.1907 వద్ద వుంది. అదే పది కేజీల సిలెండర్ అయితే రూ. 634కే పొందొచ్చు. ఇది ఇలా ఉంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెలా ఒకటో తేదీన ధరలు సవరిస్తూ ఉంటాయి. దీనితో సిలెండర్ ధరలు పెరగొచ్చు, తగ్గచ్చు. దీంతో వినియోగదారులపై ప్రతికూల ప్రభావం పడనుంది.