పసిడి ధర పైపైకి..ఏపీ,తెలంగాణలో ధరలు ఇలా..

0
98

పసిడి ప్రేమికులకు బ్యాడ్ న్యూస్. నిన్న తగ్గిన బంగారం ధర ఈరోజు మాత్రం పైపైకి దూసుకుపోయింది. బంగారం ధర పరుగులు పెడితే.. వెండి రేటు మాత్రం నిలకడగానే కొనసాగింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర వెలవెలబోయింది. ఔన్స్‌కు 0.26 శాతం క్షీణించింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1902 డాలర్లకు తగ్గింది. బంగారం దిగివస్తే వెండి కూడా అదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 0.23 శాతం తగ్గుదలతో 24.25 డాలర్లకు పడిపోయింది.

ఇదిలా ఉండగా తాజాగా బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 410 పెరిగి రూ. 50,460 కు చేరింది. అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 350 పెరిగి రూ. 46,250 గా ప‌లుకుతుంది.  బంగారం ధరలు పెరిగితే.. వెండి రేటు మాత్రం నిలకడగానే కొనసాగింది. వెండి రేటులో ఎలాంటి మార్పు లేదు. దీంతో కేజీ వెండి ధర రూ.70,000 వద్దనే ఉంది. వెండి ధర స్థిరంగా ఉండటం ఇది వరుసగా రెండో రోజు కావడం గమనార్హం.

ఇకపోతే పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలకు వస్తు సేవల పన్ను జీఎస్‌టీ, ఇతర పన్నుల, తయారీ చార్జీలు వంటివి జత చేయలేదు. కాబట్టి ఈ రేట్లకు రిటైల్ షాపుల్లో రేట్లకు వ్యత్యాసం ఉండొచ్చు. అందువల్ల మీరు ఈ విషయాన్ని గమనించాలి. ప్రాంతం ప్రాతిపదికన కూడా ధరల్లో కొంత మేర వ్యత్యాసం ఉంటుందని గమనించాలి.