ఆ రోజున ఆర్బీఐ బంద్‌..ఎందుకో తెలుసా?

RBI bandh on that day..do you know why?

0
78

జీతాలు పెంచాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 30న రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అధికారులు, ఉద్యోగులు మూకుమ్మడి సెలవు పెట్టనున్నారు. వేతన సవరణను కోరుతూ ఈ అంశంలో జోక్యం చేసుకోవాలంటూ రిజర్వ్‌ బ్యాంక్‌ అధికారులు, ఉద్యోగుల ఐక్య మండలి ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌కూ లేఖ రాసింది. ఈ క్రమంలోనే నిరసన తప్ప మరో మార్గం లేక ఈ సామూహిక సెలవుకు దిగుతున్నామని ఓ ప్రకటనలో ఐక్య మండలి స్పష్టం చేసింది.

సిబ్బందికి జీతాలు పెంచక నాలుగేండ్లపైనే అవుతుందని ఇందులో పేర్కొంది. కాగా, ఈ నిరసనలో అఖిల భారత రిజర్వ్‌ బ్యాంక్‌ ఉద్యోగుల సంఘం (ఏఐఆర్‌బీఈఏ), అఖిల భారత రిజర్వ్‌ బ్యాంక్‌ కార్మికుల సమాఖ్య (ఏఐఆర్‌బీడబ్ల్యూఎఫ్‌), ఆర్బీఐ అధికారుల సంఘం (ఆర్బీఐవోఏ), అఖిల భారత రిజర్వ్‌ బ్యాంక్‌ అధికారుల సంఘం (ఏఐఆర్‌బీవోఏ) పాల్గొంటున్నాయి.

భారత ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందని, అంతర్జాతీయ ప్రతికూలతలున్నా..అనుకూలమైన ద్రవ్య, రుణ పరిస్థితులు కలిసొస్తున్నాయని దేశ ఆర్థిక వ్యవస్థపై ఆర్బీఐ ఆర్టికల్‌ తెలిపింది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, వ్యాక్సినేషన్‌ వేగం పెరుగడం కూడా కలిసొచ్చే అంశాలేనని ఈ నెల ఆర్బీఐ బులెటిన్‌లో ప్రచురితమైన ఆర్టికల్‌లో పేర్కొన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కొంతైనా తగ్గడాన్ని ఆహ్వానించిన ఆర్బీఐ.. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్య సాధనకు ఎయిర్‌ ఇండియా అమ్మకం కీలకమే అంది.