ఫోన్ పే, పేటీఎం ద్వారా రీఛార్జ్ చేస్తున్నారా? అయితే ఛార్జీలు చెల్లించాల్సిందే!

0
37

ప్రస్తుత రోజుల్లో డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయడం సెకన్లలో జరుగుతుంది. కానీ ఒకప్పుడు డబ్బులు వేయాలన్న, తీయాలన్న బ్యాంకుకు వెళ్లడం తప్పనిసరి. ఫోన్ పే, గూగుల్ పేతో రోజూ డబ్బులు పంపిస్తుంటారు. అంతేకాక వీటి ద్వారా వివిధ రకాల రిఛార్జులను చేసుకోవచ్చు. అయితే వీటికి చార్జీలు అదనం.

ఫోన్‌ పే, పేటీఎం వంటివి యూజర్ల నుంచి సర్ చార్జీ/ ప్లాట్‌ఫామ్ ఫీజు/ కన్వీనియన్స్ ఫీజు వంటి వాటిని వసూలు చేస్తున్నాయి. మొబైల్ రీచార్జ్ లేదా బిల్ పేమెంట్స్‌ వంటి వాటిపై ఈ చార్జీలు తీసుకుంటున్నాయి. అందువల్ల మీరు రీచార్జ్ చేసుకునే ముందు ఈ విషయాన్ని గమనించండి.

ఫోన్‌పే ద్వారా మీరు మొబైల్ రీచార్జ్ చేస్తే.. ప్లాట్‌ఫామ్ చార్జీల రూపంలో రూ.1 నుంచి రూ. 2 వరకు చెల్లించుకోవాలి. మీరు ఏ పేమెంట్ మోడ్ ద్వారా అయినా లావాదేవీ నిర్వహించినా ఈ ఫీజు పడుతుంది. అంటే యూపీఐ, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు, ఫోన్ వాలెట్ ఇలా మీరు ఎలా డబ్బులు చెల్లించినా ఈ ప్లాట్‌ఫామ్ ఫీజు పడుతుంది. రూ. 100 మొబైల్ రీచార్జ్‌ చేసుకుంటే రూ. 101 చెల్లించాల్సి ఉంటుంది.