పట్టాలెక్కనున్న సాధారణ రైళ్లు..రిజర్వేషన్‌ ప్రక్రియలో మార్పులు

Regular trains counting .. Changes in the reservation process

0
37

కొవిడ్‌ కారణంగా నిలిపివేసిన సాధారణ రైళ్లను తిరిగి ప్రారంభించేందుకు రైల్వేశాఖ సమాయత్తమవుతోంది. ప్రస్తుతం నడుస్తోన్న ప్రత్యేక రైళ్ల స్థానంలో అన్ని సాధారణ రైలు సర్వీసులను నడిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. టికెట్లు జారీ చేసే రిజర్వేషన్ వెబ్ సైట్​లో రైలు నెంబర్లను మార్చే ప్రక్రియను రైల్వేశాఖ చేపట్టింది.

దీనికోసం రైలు టికెట్ల రిజర్వేషన్ వ్యవస్థలో డేటా అప్ డేట్ చేస్తున్నారు. దీనివల్ల వారం రోజులపాటు అర్ధరాత్రి సమయాల్లో రిజర్వేషన్ సదుపాయాన్ని నిలిపివేసింది. నవంబర్ 20 వరకు..రాత్రి 11 గంటల 30నిమిషాల నుంచి తెల్లవారుజామున 5 గంటల 30 నిమిషాల వరకు రిజర్వేషన్ సేవలు నిలిపివేశారు. ఈ సమయంలో టికెట్‌ రిజర్వేషన్లు, కరెంట్‌ బుకింగ్‌, టికెట్ల రద్దు వంటి సేవలు అందుబాటులో ఉండవని అధికారులు తెలిపారు.

మార్పు చేసిన రైళ్ల నెంబర్లు ప్రయాణికులకు ఎస్ఎమ్ఎస్ ద్వారా..రైల్వేశాఖ తెలియజేయనుంది. సంబంధిత రైల్వే స్టేషన్‌ విచారణ కేంద్రాల్లో, హెల్ప్‌ డెస్క్‌ల వద్ద కూడా సమాచారం తెలుసుకోవచ్చని చెప్పారు. సురక్షిత, ఆటంకాలు లేని ప్రయాణానికి అందరూ సహకరించాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు కోరారు. ప్రత్యేక రైళ్లలో అదనపు చార్జీలు వసూలు చేస్తుండగా..ఇకపై ఆ సమస్య ఉండదని చెప్పారు.

వృద్ధులు, వికలాంగులు, పాత్రికేయులు సహా ఇతర రంగాల్లోని నిర్దేశిత విభాగాల వారికి టికెట్ల ఛార్జీల్లో రాయితీలు వర్తిస్తాయని రైల్వేశాఖ తెలిపింది. ఈ సమయంలో పిఆర్‌ఎస్‌ సేవలు మినహా 139 టెలిపోన్‌ సేవలతో సహా మిగతా అన్ని విచారణ సేవలు ఎలాంటి అంతరాయాలు లేకుండా అందుబాటులో ఉంటాయని తెలిపింది. కోవిడ్‌ మహమ్మారి రాక అనంతరం.. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు సాధారణ రైళ్లస్థానంలో ప్రత్యేక రైళ్లను గతంలో ప్రవేశపెట్టింది. ప్రత్యేక చార్జీలతో ప్రత్యేక రైళ్లుగా రైళ్లను నడిపింది. ఇప్పుడు వాటి స్థానంలో సాధారణ రైళ్లను నడపాలని నిర్ణయించింది.

రైలు నెంబర్లు, సంబంధిత క్లాసుల చార్జీలను సమయానుసారం మార్గదర్శకాలను అనుసరించి నడిపించాలని భారతీయ రైల్వే నిర్ణయం మేరకు దక్షిమ మధ్య రైల్వే చర్యలు తీసుకుంటోంది. ప్రత్యేక రైళ్లలో అదనపు చార్జీలు వసూలు చేస్తుండగా ఇకపై ఆ సమస్య ఉండదని అధికారులు తెలిపారు. సాధారణ రైళ్లలో కొవిడ్ రాక కంటే ముందు ఉన్న చార్జీలనే వసూలు చేస్తామన్నారు.

ఇకపై నడిచే సాధారణ రైళ్లలో నిర్దేశిత కేటగిరీ వారికి టికెట్ చార్జీలో రాయితీలు అమలు చేయనుంది. వృద్దులు, వికలాంగులు, పాత్రికేయులు, సహా పలు రంగాల్లోని నిర్దేశిత కేటగిరీల వారికి టికెట్ చార్జీలో రాయితీలు వర్తించనున్నాయి.