మన దేశంలో పెట్రోల్, డీజీల్ రేట్లు మండిపోతున్నాయి. రేట్లు బాగా పెరుగుతున్నాయి. సెంచరీని దాటేశాయి. అయితే ఒకటో తేది వచ్చింది అంటే గ్యాస్ ధర గురించి కూడా సామాన్యులకి ఆందోళన ఉంటుంది. రేటు ఎంత పెరుగుతుందా అని ఆలోచిస్తారు. వంట గ్యాస్ సిలిండర్ ధరల భారం సామాన్యుడిని ఊపిరి పీల్చుకోనివ్వడంలేదు.
దేశీయంగా సబ్సిడీయేతర ఎల్పీజీ సిలిండర్ల ధరను రూ. 25 పెంచాయి. దీంతో 14.2 కిలోల దేశీయ సిలిండర్ ధర ఇప్పుడు ఢిల్లీలో 834.50 రూపాయలుగా అమ్ముతారు. ఇక కమర్షియల్ సిలిండర్ ధర 84 రూపాయలు పెంచాయి. జూలై 1 నుంచి ఈ కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి.
దేశంలో ఇక వంట గ్యాస్ ధరలు చూద్దాం.
ముంబైలో రూ. 834.50
చెన్నైలో రూ .850.50
హైదరాబాద్ లో రూ.887