కస్టమర్లకు షాకిచ్చిన SBI బ్యాంక్..వడ్డీ రేట్లు పెంపు!

0
129

బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బిఐ ఎప్పటికప్పుడు కొత్త రూల్స్ ను తీసుకొస్తుంది. ఇప్పటికే కస్టమర్లకు వీలైనన్ని సౌకర్యాలు ఆన్ లైన్ లోనే ఉండేలా చేస్తూ సేవలను విస్తరిస్తుంది. తాజాగా ఎస్బీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. హోమ్ లోన్స్‌పై మినిమమ్ రేటును ఎస్బీఐ పెంచేసింది. దీనితో హౌసింగ్ లోన్స్‌పై కనీస రుణ రేటు 7.55 శాతానికి చేరింది.

జూన్ 15 నుంచి ఈ కొత్త రేటు అమలులోకి వచ్చిందని ఎస్బీఐ తెలిపింది. బ్యాంక్ ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ బేస్డ్ లెండింగ్ రేటు (ఈబీఎల్ఆర్)ను 7.55 శాతానికి పెంచిన విషయం తెలిసిందే. బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం ఇది వరకు ఈ రేటు 7.05 శాతంగా ఉండేది. దీంతో రుణం తీసుకొని సొంతింటి కల సాకారం చేసుకోవాలని భావించే వారిపై ప్రతికూల ప్రభావం పడనుంది.

స్టేట్ బ్యాంక్ జూన్ 15 నుంచి మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటును (ఎంసీఎల్ఆర్) కూడా పెంచేసింది. 20 బేసిస్ పాయింట్ల మేర పెంచుతూ ఎస్బీఐ నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఎస్బీఐ డిపాజిట్ దారులకు తీపికబురు అందించింది. ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) రేట్లు పెంచింది. 15 నుంచి 20 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లు పైకి కదిలాయి. దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఇటీవల రెపో రేటును వరుసగా రెండు సార్లు పెంచుతూ వెళ్లడం ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు.