Good News: ఎఫ్‌డీ వడ్డీ రేట్లను పెంచిన ఎస్​బీఐ..ఎంతంటే?

SBI raises FD interest rates

0
90

ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శుభవార్త చెప్పింది. ఫిక్స్‌డ్ డిపాజిట్ల(ఎఫ్‌డీ)పై చెల్లించే వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు బ్యాంకు ప్రకటించింది. ఈనెల 10 నుంచి ఇది అమల్లోకి వస్తుందని పేర్కొంది. రూ.2 కోట్లకు పైబడిన ఫిక్స్​డ్​ డిపాజిట్లపై మాత్రమే ఇది వర్తిస్తుందని ఎస్బిఐ తెలిపింది.

రూ.2 కోట్లకు పైబడిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 20-40 బేసిస్‌ పాయింట్ల మేరకు పెంచినట్లు వెల్లడించింది. వడ్డీ రేట్లను పెంచడం వల్ల  మార్చి 10 నుంచి ఎఫ్‌డీలపై 3.30 శాతం వడ్డీ లభించనుంది. అలాగే సీనియర్ సిటిజన్లకు ఈ ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 3.60 శాతం నుంచి 3.80 శాతానికి పెరిగింది.

ఏడాది నుంచి 10 ఏళ్ల వ్యవధి డిపాజిట్లపై 3.60శాతం, వయోధికులకు 4.10శాతం వడ్డీ లభిస్తుంది. ఇక రూ.2 కోట్లలోపున్న డిపాజిట్లపై రెండు- మూడేళ్ల కాలవ్యవధికి 5.20శాతం, మూడు నుంచి ఐదేళ్లలోపు డిపాజిట్లపై 5.45 శాతం వడ్డీని అందిస్తోంది. 5-10 ఏళ్ల వ్యవధి డిపాజిట్లపై 5.50 శాతం వడ్డీనిస్తోంది.