బంగారానికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు. బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇక తాజాగా తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి.
తాజాగా హైదరాబాద్ మార్కెట్ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 700 పెరిగి రూ. 51, 380 గా నమోదు కాగా… అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 650 పెరిగి రూ. 47, 100 గా పలుకుతుంది.
ఇక వెండి ధరలు కూడా పెరిగాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 1200 పెరిగి రూ. 61,200 గా నమోదు అయింది.