అమెజాన్​ ప్రైమ్​ యూజర్లకు షాక్..!

Shock to Amazon Prime users ..!

0
86

ప్రైమ్​ యూజర్లకు, కొత్తగా ప్రైమ్​ సేవల్ని పొందాలనుకుంటున్నవారికి అమెజాన్ షాకింగ్​ న్యూస్​. అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ధరలను ఏకంగా 50 శాతం పెంచనున్నట్లు తెలుస్తోంది. ప్రైమ్ వార్షిక సబ్‌స్క్రిప్షన్​తో పాటు నెలవారీ, మూడు నెలల కాలానికి చెల్లించాల్సిన మెంబర్​షిప్​ ధరల కూడా ఈ మేరకు పెరగనున్నట్లు సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు.

ప్రస్తుతం ప్రైమ్​ సబ్​స్క్రిప్షన్​​​ తీసుకోవాలంటే రూ.999 చెల్లిస్తే సరిపోతుంది. అయితే త్వరలో ఈ మెంబర్‌షిప్‌కు రూ.1,499 చెల్లించాల్సి ఉంటుంది. నెలవారీ, త్రైమాసిక ప్లాన్​లకు కూడా ధరల పెంపు వర్తించనున్నట్లు సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు.

దీంతో నెలవారి మెంబర్​షిప్​కు రూ.129 చెల్లించాల్సి ఉండగా.. త్వరలో రూ.179 కానుంది. అలాగే ప్రస్తుతం మూడు నెలల కాలానికి చెల్లించే రూ.329, రూ.459కి పెరగనుంది. అయితే ఈ ధరలు ఎప్పటి నుంచి పెరుగుతాయన్న స్పష్టత మాత్రం ఇవ్వలేదు.