అవును అనుకున్నదే జరిగింది. ఎయిర్టెల్, వోడాఫోన్ బాటలోనే నడిచింది రిలయన్స్ జియో. తాము కూడా ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది. ఒక్కో ప్లాన్ ధరను 19.6 నుంచి 21.3 శాతం వరకు పెంచుతున్నట్లు తెలిపింది రిలయన్స్ జియో. ఈ ధరలు డిసెంబర్ 1న అమలులోకి రానున్నాయి.
ప్రస్తుతం రూ.75 ఉన్న జియోఫోన్ ప్లాన్ రూ.91కి పెరగనుంది. 3జీబీ డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, 50 ఎస్ఎమ్ఎస్లు రానున్నాయి.
అన్లిమిటెడ్ ప్లాన్ రూ.129..రూ.155కు చేరనుంది. ఈ ప్లాన్‌లో 2 జీబీ నెలవారీ డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 300 ఎస్ఎమ్ఎస్లు ఉంటాయి.
రూ.555 ప్రీపెయిడ్ ప్లాన్ కాస్త.. రూ.666కి చేరుకుంటుంది. రూ.599 ప్లాన్ 719కి పెరగనుంది.
రూ.2,399కి వచ్చే ఏడాది ప్రీపెయిడ్ ప్లాన్.. పెరిగిన ధరల ప్రకారం రూ.2,897కి చేరుకుంటుంది.
టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ధరలను పెంచుతునున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రీపెయిడ్ ప్లాన్స్, అన్లిమిటెడ్ వాయిస్ ప్యాక్‌లు, మొబైల్ డేటా రీఛార్జ్‌లపై ఉన్న ధరలపై 20-25 శాతం పెంచినట్లు తెలిపింది.
వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు పెద్ద షాక్ తగిలింది. మొబైల్ ఛార్జీలను భారీగా పెంచుతున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. మొబైల్ కాల్స్, డేటా ప్లాన్లపై దాదాపు 20 నుంచి 25 శాతం మేర పెంపు ఉండనున్నట్లు స్పష్టం చేసింది. నవంబర్ 25 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొంది.