జియో యూజర్లకు షాక్..పెరగనున్న ప్లాన్​ల ధరలు

Shock to Geo users .. Prices of plans that will increase

0
42

అవును అనుకున్నదే జరిగింది. ఎయిర్​టెల్​, వోడాఫోన్​ బాటలోనే నడిచింది రిలయన్స్ జియో. తాము కూడా ప్రీపెయిడ్​ ప్లాన్​ల ధరలను పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది. ఒక్కో ప్లాన్​ ధరను 19.6 నుంచి 21.3 శాతం వరకు పెంచుతున్నట్లు తెలిపింది రిలయన్స్ జియో. ఈ ధరలు డిసెంబర్ 1న అమలులోకి రానున్నాయి.

ప్రస్తుతం రూ.75 ఉన్న జియోఫోన్​ ప్లాన్ రూ.91కి పెరగనుంది. ​3జీబీ డేటా, అన్​లిమిటెడ్ వాయిస్ కాల్స్​, 50 ఎస్​ఎమ్​ఎస్​లు రానున్నాయి.

అన్​లిమిటెడ్​ ప్లాన్ రూ.129..రూ.155కు చేరనుంది. ఈ ప్లాన్​లో 2 జీబీ నెలవారీ డేటా, అన్​లిమిటెడ్​ వాయిస్ కాలింగ్, 300 ఎస్​ఎమ్​ఎస్​లు ఉంటాయి.

రూ.555 ప్రీపెయిడ్​ ప్లాన్ కాస్త.. రూ.666కి చేరుకుంటుంది. రూ.599 ప్లాన్ 719కి పెరగనుంది.

రూ.2,399కి వచ్చే ఏడాది ప్రీపెయిడ్ ప్లాన్.. పెరిగిన ధరల ప్రకారం రూ.2,897కి చేరుకుంటుంది.

టెలికాం దిగ్గజం ఎయిర్​టెల్​ ప్రీపెయిడ్ రీఛార్జ్ ధరలను పెంచుతునున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రీపెయిడ్ ప్లాన్స్​, అన్​లిమిటెడ్ వాయిస్ ప్యాక్​లు, మొబైల్ డేటా రీఛార్జ్​లపై ఉన్న ధరలపై 20-25 శాతం పెంచినట్లు తెలిపింది.

వొడాఫోన్​ ఐడియా కస్టమర్లకు పెద్ద షాక్​ తగిలింది. మొబైల్​ ఛార్జీలను భారీగా పెంచుతున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. మొబైల్​ కాల్స్​, డేటా ప్లాన్లపై దాదాపు 20 నుంచి 25 శాతం మేర పెంపు ఉండనున్నట్లు స్పష్టం చేసింది. నవంబర్​ 25 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొంది.