బంగారం, వెండి కొనుగోలుదారుల‌కు షాక్..భారీగా పెరిగిన ధరలు

Shock to gold and silver buyers .. Massively increased prices

0
91

బంగారం, వెండి కొనుగోలు దారుల‌కు షాక్ తగిలింది. గ‌త రెండు రోజుల నుంచి త‌గ్గుతూ వ‌స్తున్న బంగారం ధరలు నేడు ఒక్కసారిగా రూ.540 పెరిగింది. దీంతో ప‌ది గ్రాముల బంగారం ధ‌ర మ‌రోసారి రూ. 50 వేల మార్క్ ను అందుకుంది. అలాగే వెండి కూడా వ‌రుస‌గా రెండో రోజు భారీగా పెరిగింది. నిన్న రూ.200 మాత్ర‌మే పెర‌గ‌గా నేడు ఏకంగా రూ.600 పెరిగింది.

ప‌లు న‌గ‌రాల్లో బంగారం, వెండి ధ‌రలు ఇలా

హైద‌రాబాద్ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 46,300 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 50,510కి చేరింది. అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 68,600 గా ఉంది.

విజ‌య‌వాడ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 46,300 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 50,510 కి చేరింది. అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 68,000 గా ఉంది.

ముంబై న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 46,300 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 50,510 కి చేరింది. అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 63,800 గా ఉంది.