సామాన్యుల నెత్తిపై మరో భారం పడనుంది. ఇప్పటికే పెరిగిన నిత్యవసర సరుకుల ధరలతో నానా తంటాలు పడుతున్నారు. ఇది చాలదా అన్నట్టు చమురు సంస్థలు వాహనదారులకు షాక్ ఇచ్చాయి. ఐదు నెలల నుండి పెట్రోల్. డీజిల్ ధరలు స్థిరంగా ఉండగా నేడు ధరలను పెంచాయి.
దీనితో పెరిగిన ధరలు మంగళవారం ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. మరి కొన్ని రోజుల పాటు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. కాగా లీటర్ పెట్రోల్ పై 91 పైసలు, డీజిల్ పై 88 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.
దీనితో నిన్నటి వరకు హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20 ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ. 94.62 గా ఉంది. కాగ నేడు పెరిగిన ధరలతో హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.10 కు, డీజిల్ ధర రూ. 95.49కు చేరింది.