సామాన్యులకు షాక్..పెరిగిన వాటి ధరలు

Shock to the common people..Increased prices

0
37

పెట్రోల్, డీజిల్, గ్యాస్, కూరగాయలు ఇలా ప్రతి వస్తువు ధర పెరుగుతుంది. దీనితో సామాన్యులకు జీవనం భారంగా మారింది. మొన్న బిస్కెట్ల ధర పెరిగింది. ఇప్పుడు సబ్బు, సర్ఫ్ ధరలు కూడా పెరిగాయి.  సబ్బులు, డిటర్జెంట్ల ధరలను పెంచుతున్నట్లు HUL, ITC ప్రకటించాయి.

వీల్ డిటర్జెంట్ పౌడర్, రిన్స్ బార్, లక్స్ సబ్బు ధరలను 3.4 శాతం నుంచి 21.7 శాతానికి పెంచుతున్నట్లు తెలిపింది. అదే సమయంలో, ఐటీసీ ఫియామా సబ్బు ధరను 10 శాతం, వివెల్ 9 శాతం, ఎంగేజ్ డియోడరెంట్ ధరలను 7.6 శాతం పెంచిందని CNBC TV18 నివేదిక ద్వారా తెలిసింది.

దేశంలోని రెండు అతిపెద్ద ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (FMCG) కంపెనీలు ధరల పెరుగుదల వెనుక ఇన్‌పుట్ ఖర్చు పెరగడమే కారణమని పేర్కొన్నాయి. మొత్తం ధరల ఒత్తిడిని వినియోగదారులకు అందించకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రతినిధి తెలిపారు.