Stock Talk: లాభాల్లో దూసుకుపోతున్న స్టాక్‌ మార్కెట్లు

0
29

ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడులతో విరుచుకుపడుతోంది. ఇప్పటికే ఉక్రెయిన్‌ దేశంలోని.. 83 స్థావరాలను స్వాధీనం చేసుకుంది రష్యా. అయితే.. ఉక్రెయిన్‌ క్రైసీస్‌ నేపథ్యంలో.. నిన్న ఇండియాలో స్టాక్‌ మార్కెట్లు కుప్ప కూలాయి. కానీ.. ఇవాళ మాత్రం ఇండియాలో మెరుగైన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం లాభాల్లో స్టాక్‌మార్కెట్లు కొనసాగుతున్నాయి. ఏకంగా… 1200 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్ కొనసాగుతుండగా… 350 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ ఉంది. ఇవాళ సాయంత్రం వరకు స్టాక్‌మార్కెట్లు లాభాల్లో కొనసాగే ఛాన్స్‌ ఉన్నట్లు ఆర్థిక వేత్తలు చెబుతున్నారు.