క్రెడిట్‌ కార్డు తీసుకుంటున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

0
47

ప్రస్తుత రోజుల్లో రుణాలు తీసుకోవడం చాలా తేలికైంది. అయితే రుణాలు తీసుకోడానికి అనేక దారులున్నాయి. కానీ చాలా మంది క్రెడిట్ కార్డు వాడడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. క్రెడిట్ కార్డు వల్ల చాలా లాభాలతో పాటు నష్టాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తొలిసారి కార్డును వాడేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

రుణం ఏదైనా సరే.. దాన్ని సకాలంలో తీర్చాల్సిన బాధ్యత రుణగ్రహీతపైన అంటే ఋణం తీసుకున్న వారిపై ఉంటుంది. కార్డు బిల్లునూ నిర్ణీత గడువులోపు తీర్చడం ఎప్పుడూ మంచిది. కనీస చెల్లింపుతోనే సరిపెడితే.. వడ్డీల భారం మోయాల్సి వస్తుంది. అదీ చెల్లించకపోతే రుసుములు భారీగానే ఉంటాయి.

క్రెడిట్‌ కార్డు పరిమితిలో ఎప్పుడూ 30 శాతానికి మించి వాడకూడదు. ఇది మీ ఆర్థిక క్రమశిక్షణను సూచిస్తుంది. తక్కువ ఖర్చు చేయడం వల్ల బిల్లు చెల్లింపులోనూ ఇబ్బంది ఉండదు. రుణ వినియోగ నిష్పత్తి తక్కువగా ఉన్నప్పుడు క్రెడిట్‌ స్కోరు మెరుగవుతుంది. 750పైన స్కోరున్నప్పుడు కొత్త రుణాలు తీసుకోవడం సులభమవుతుంది.