శుభవార్త..భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

The good news is that gold and silver prices have plummeted

0
99

ఈ సీజన్‌లో బంగారానికి భారీగా డిమాండ్ ఉంటుంది. ఐతే మొన్నటి వరకు భారీగా పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు దిగొస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం కొనే వారికి ఇది శుభవార్తే. అలాగే వెండి కొనుగోలు చేసే వారికి గుడ్ న్యూస్. వ‌రుస‌గా రెండో రోజు బంగారం, వెండి ధ‌ర‌లు త‌గ్గాయి. ఈ రెండు రోజ‌ల్లో ప‌ది గ్రాముల బంగారం ధ‌ర రూ. 940 వ‌ర‌కు త‌గ్గింది. అదే విధంగా వెండి ధ‌ర‌లు గ‌ణ‌నీయంగా తగ్గాయి.

గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా.. ఈ రెండు రోజుల్లో కిలో గ్రాము వెండిపై ఏకంగా రూ. 3,700 వ‌ర‌కు త‌గ్గింది. ఉక్రెయిన్ ప్ర‌భావంతో రెండు రోజుల ముందు బంగారం, వెండి ధ‌ర‌లు పెరిగినా.. ప్ర‌స్తుతం త‌గ్గుముఖం ప‌ట్టాయి. కాగ నేటి మార్పుల‌తో దేశంలోని ప‌లు ప్ర‌ధాన న‌గ‌రాల్లో బంగారం, వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి.

హైద‌రాబాద్ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 46,350గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 50,570కి చేరింది. అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 69,000 గా ఉంది.

విజ‌య‌వాడ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 46,350 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 50,570 కి చేరింది. అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 69,000 గా ఉంది.

ఢిల్లీ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 46,350 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 50,570 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 64,000 గా ఉంది.