గుడ్ న్యూస్..పెట్రోల్ రేట్లను మరింత తగ్గించిన తొమ్మిది రాష్ట్రాలు..

The good news is that nine states have further reduced petrol rates.

0
148

వాహనదారులకు దీపావళి పండుగ సందర్బంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించింది. పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 మేర కోత విధించింది. దీంతో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గాయి. అయితే రాష్ట్రాలు కూడా పెట్రో ఉత్పత్తులపై వ్యాట్ ట్యాక్స్ తగ్గించాలని కేంద్రం సూచించింది. దానితో మరికొన్ని రాష్ట్రాలు పెట్రోల్ రేట్లను మరింత తగ్గించాయి. ఆ రాష్ట్రాలు ఏవి, ఎంత రేట్లు తగ్గించాయో ఇప్పుడు చూద్దాం..

మొత్తంగా 9 బీజేపీ పాలిత రాష్ట్రాలు పెట్రోల్‌పై విధించే పన్నును తగ్గించాయి. ఈ జాబితాలో అసోం, త్రిపుర, మణిపూర్, కర్ణాటక, గోవా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఉన్నాయి. కాగా అసోం, త్రిపుర, మణిపూర్, కర్ణాటక, గోవా రాష్ట్రాలు లీటర్ పెట్రోల్‌పై రూ. 7 తగ్గించాయి.

మరోవైపు యూపీ ఏకంగా రూ.12 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. హిమాచల్ ప్రదేశ్ మాత్రం రూ. 2 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రజలకు పెట్రోల్ మరింత చౌకగా అందుబాటులోకి రానుంది. కాగా ప్రస్తుతం బీజేపీ పాలిత రాష్ట్రాలు మాత్రమే పెట్రోల్ ధరలను తగ్గించాయి. మిగతా రాష్ట్రాల్లో కూడా వ్యాట్ ట్యాక్స్ తగ్గించాలని డిమాండ్లు వస్తున్నాయి. పెట్రోల్ రేట్లపై పన్ను తగ్గించే విషయంలో తెలుగు రాష్ట్రాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.