ఆఫ్టనిస్తాన్ ను తాలిబన్లు కైవసం చేసుకోవడంతో ఇప్పుడు అందరూ అసలు
ఆఫ్టనిస్తాన్ నుంచి పాలన ఎలా ఉంటుంది అక్కడ ప్రజల పరిస్దితి ఏమిటి ఇలా అనేక ఆలోచనలు ఆలోచిస్తున్నారు. మరోపక్క ట్రేడర్లు కూడా ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే ? ఈ సంక్షోభం వల్ల కొన్ని రకాల వస్తువుల ధరలు పెరుగుతాయి అంటున్నారు. ఇప్పటికే లిథియం నిక్షేపాలను స్వాధీనం చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ముందుగా అసలు అక్కడ నుంచి ఏ వస్తువులు ఎక్కువగా వస్తాయి అనేది చూస్తే. ఎండుద్రాక్ష, వాల్నట్స్, బాదం, అత్తి పండ్లు, పైన్ గింజలు, పిస్తా, ఎండిన ఆప్రికాట్, నేరేడు పండు, చెర్రీ, పుచ్చకాయ, మరికొన్ని ఔషధ మూలికలను భారత్ కు ఎగుమతి చేస్తోంది. వీటి ధరలు గతంలో పోలిస్తే ఇప్పుడు రేట్లు పెరుగుతాయి. ఇప్పటికే డ్రై ఫ్రూట్స్ 25 శాతం రేట్లు పెరిగాయి.
ఇక మరో వైపు ఆఫ్ఘనిస్తాన్ కు భారతదేశ ఎగుమతులలో టీ, కాఫీ, మిరియాలు, పత్తి, బొమ్మలు, పాదరక్షలు మన నుంచి ఎక్కువ ఎక్స్ పోర్ట్ అవుతాయి. గత వారం రోజులుగా తాలిబాన్లు అఫ్ఘనిస్తాన్ను స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో దిగుమతి, ఎగుమతుల రవాణా పూర్తిగా నిలిచిపోయింది.