వాట్సాప్ లో మూడు టిక్కుల ఫీచర్​..నిజం ఎంతంటే?

Three tick feature in WhatsApp..what is the truth?

0
102

వాట్సాప్ ప్రముఖ సామాజిక మాధ్యమాల్లో ఒకటి. యూజర్ల కోసం ఎప్పటికప్పుడు అప్డేట్ ఫీచర్లను తీసుకొస్తుంది. తాజాగా ఈ యాప్​ మరో సరికొత్త ఫీచర్​ను అందుబాటులోకి తీసుకువస్తోందని నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అదే మూడు టిక్కుల ఫీచర్. మరి ఇందులో వాస్తవం ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా వాట్సాప్​లో మనం ఎవరికైనా మెసేజ్​ చేస్తే..డెలివరీ కాకపోతే ఒక బూడిద రంగు టిక్​ కనిపిస్తుంది. అదే డెలివరీ అయితే రెండు టిక్​ సింబల్స్​ అదే రంగులో కనిపిస్తాయి. ఒక వేళ మనం పంపిన మెసేజ్​ను ఎదుటి వ్యక్తి చూస్తే..ఆ రెండు టిక్​ సింబల్స్​ కాస్తా నీలి రంగులోకి మారిపోతాయి. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియే. వీటికి తోడు మన చాట్​ను, మీడియాను స్క్రీన్​ షాట్​ తీస్తే.. మనకు తెలిసేందుకు వాట్సాప్​ మూడో టిక్​ సింబల్​ను తీసుకురానున్నట్లు గాసిప్స్​ వినిపించాయి.

అవతలి వ్యక్తి మన మెసేజ్​లు, మనం పంపిన ప్రైవేట్​ వీడియోలు, ఫొటోలను స్క్రీన్​ షాట్​ తీస్తే.. వెంటనే అలర్ట్​గా మూడు టిక్కులు కనిపిస్తాయన్నది ఆ వార్తల సారాంశం. అంతేగాకుండా ఈ ఫీచర్​ను పరీక్షించి త్వరలోనే వాట్సాప్​ యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు న్యూస్​ తెగ వైరల్​ అయ్యింది. అయితే ఇది పూర్తిగా అవాస్తవం అని వాట్సాప్ వివరాలను ఎప్పటికప్పుడు లీక్​ చేసే వెబ్​ బీటా ఇన్ఫో తెలిపింది.

వాస్తవానికి ఇలాంటి ఫీచర్​ ఇతర యాప్​ల్లో అందుబాటులో ఉంది. యువత ఎక్కువగా ఉపయోగించే స్నాప్​చాట్​, ఇన్​స్టాగ్రామ్ డీఎం వానిష్​ మోడ్​లలో ఎదుటి వ్యక్తి స్క్రీన్​ షాట్​ తీస్తే మనకు తెలిసే ఫీచర్​ ఉంది. నిజానికి ఈ ఫీచర్​ను వివిధ కారణాల వల్ల వాట్సాప్​ తీసుకురాలేదు. కాబట్టి ఈ వార్తలు అవాస్తవం.