మళ్లీ పెరిగిన బంగారం వెండి ధరలు – నేడు రేట్లు ఇవే

Today Gold and silver rates

0
35
Gold

 

గడిచిన నెల బంగారం ధరలు సాధారణంగానే ఉన్నాయి. కానీ ఈనెల మాత్రం పుత్తడి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. భారీగా బంగారం ధర పెరుగుతోంది. పుత్తడి ధరలు ఈ నెలలో దాదాపు 7 రోజులు పెరుగుదల నమోదు చేశాయి. నిన్న తగ్గిన బంగారం ధర నేడు పరుగులు పెట్టింది. మరి వెండి అదే బాటలో ఉంది చూద్దాం ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో.

హైదరాబాద్ మార్కెట్లో బుధవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరిగింది. దీంతో రేటు రూ.50 వేలకి చేరింది. రూ.50,070కు ట్రేడ్ అవుతోంది.

అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.100 పెరుగుదలతో రూ.45,900కు ట్రేడ్ అవుతోంది. బంగారం ధర పెరిగితే వెండి రేటు కూడా పరుగులు పెట్టింది. రూ.500 పెరుగుదల నమోదు చేసింది . దీంతో కేజీ వెండి ధర రూ.76,300కు చేరింది. బంగారం వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్ ట్రేడ్ పండితులు చెబుతున్నారు.