బంగారం 24 క్యారెట్లు 22 క్యారెట్లు 20 క్యారెట్లు అంటే ఏమిటి ? వాటి మధ్య తేడా ఇదే

What is 24 carat gold 22 carat gold 20 carat gold ?

0
81

మనం బంగారం గురించి వార్త విన్న సమయంలో 24,22,20,18 క్యారెట్ల గురించి వింటాం. అయితే 24 లేదా 22 క్యారెట్లు అంటే ఏమిటి. ఈ తేడా ఏమిటి అనేది ఎప్పుడైనా ఆలోచించారా? క్యారెట్ అనేది స్వచ్ఛతకు నిదర్శనం. క్యారెట్ వాల్యూ పెరిగే కొద్ది బంగారం స్వచ్ఛత పెరుగుతుంది.

మనకు వరల్డ్ లో ఎక్కడైనా బంగారం స్వచ్ఛతను 0 నుంచి 24 వరకు లెక్కిస్తారు. ఈ బంగారంలో రాగి, నికెల్, వెండి, పల్లాడియం లోహాలు కలిస్తే ఇది మరింత బలపడి ఆభరణాలు చేయడం సాధ్యపడుతుంది. బంగారు వస్తువులు తయారీలో ఈ లోహాలు కలిపితేనే అవి బలంగా ఉంటాయి.

24 క్యారెట్ల బంగారం గురించి చూద్దాం
ఈ క్యారెట్లో బంగారం 99.9 శాతం స్వచ్ఛత కలిగి ఉంటుంది. ఇందులో ఎలాంటి మెటల్స్ కలపరు. అందుకే ఇది రేటు ఎక్కువ ఉంటుంది.

22 క్యారెట్ల బంగారం. ఇందులో రెండొంతుల్లో రాగి, జింక్ లాంటి మెటల్స్ ఉంటాయి. . ఇది 91.6 శాతం స్వచ్ఛమైన బంగారం. ఈ బంగారంతో ఆర్నమెంట్స్ చేస్తారు.

18 క్యారెట్ల బంగారం
18 క్యారెట్ల బంగారం దీనిని 750 బంగారం అని కూడా పిలుస్తుంటారు.18 క్యారెట్ల బంగారంలో 75 శాతం పసిడి, 25 శాతం జింక్, రాగి, నికెల్ లాంటి లోహాలు ఉంటాయి. డైమండ్ జువెలరీ తయారీలో 18కే బంగారం ఎక్కువగా వాడతారు.

14 క్యారెట్ల బంగారం
ఈ బంగారంలో 58.3 శాతం గోల్డ్, 41.7 శాతం ఇతర మెటల్స్ ఉంటాయి. ఇది చాలా రేర్ గా కొంటారు. కొన్ని వస్తువుల తయారీకి దీనిని కొంటారు.