పాలతో ఈ ఆహారాలు అస్సలు కలిపి తీసుకోవద్దు

Do not mix these foods with milk at all

0
42

మనం అన్నీ రకాల ఫుడ్ తీసుకుంటాం. అయితే మీకు తెలుసా కొన్ని రకాల ఫు్డ్స్ కలిపి తీసుకుంటే అలర్జీ సమస్యలు వస్తాయి. అంతేకాదు అజీర్తి, జీర్ణం అవ్వకపోవడం ఇలాంటి సమస్యలు వస్తాయి. అంతేకాదు ఇలాంటి ఫుడ్ లో ముందు చెప్పాల్సింది డెయిరీ ఫుడ్స్. ముఖ్యంగా పాలు చాలా మంది తాగుతారు. కాని పాలతో పాటు కొన్ని ఫుడ్స్ తీసుకోకూడదు అంటున్నారు నిపుణులు. మరి పాలతో పాటు తీసుకోకూడని ఆహారాలు ఏమిటో చూద్దాం.

1. గుడ్లు, మాంసం, చేపలు ఇవి తిన్న తర్వాత పాలు తీసుకోకూడదు. కనీసం నాలుగు నుంచి ఐదు గంటల గ్యాప్ ఉండాల్సిందే.
2. ఎక్కువగా సిట్రిస్ ఫుడ్ తీసుకునే వారు ఇలా పాలతో అస్సలు తీసుకోకూడదు. ముఖ్యంగా మూడు గంటల గ్యాప్ అయితే కచ్చితంగా ఉండాలి పుల్లటి పండ్లకు పాలు తీసుకోవడానికి.
3. అరటి అరటిపండ్లు పాలు ఈ రెండు కలిపి తీసుకుంటే అరుగుదలకు సమయం పడుతుంది. జీర్ణం కాదు. అందుకే జ్యూస్ చేసుకున్నా పాలు వేసుకోకుండా చేసుకోవడం మేలు.
4. పెరుగు ఇది పులిసి ఉంటుంది. ఇందులో ఫ్రెష్ మిల్క్ వేయడం వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. ముఖ్యంగా జీర్ణ సంబంధ సమస్యలు వస్తాయి.
5. ముల్లంగి పాలతో అస్సలు తీసుకోవద్దు. బాడీలో వేడి పెరుగుతుంది. అందుకే అరుగుదలకు సమయం పడుతుంది.
6. ఆకుకూరలు పాలు రెండు కలిపి తీసుకోకూడదు. ఇలా తీసుకుంటే ఆకుకూరలో ఉండే పోషకాలు పోతాయి.