వాట్సాప్ అదిరిపోయే అప్ డేట్..గ్రూప్ కాలింగ్​కు నయా లుక్​!

Whatsapp creepy update..new look for group calling!

0
100

పోటీని దృష్టిలో పెట్టుకుని వినియోగదారుల కోసం వాట్సాప్ మరిన్ని కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది​. అందులో భాగంగానే త్వరలోనే వీటిని ఐఓఎస్​, ఆండ్రాయిస్​ యూజర్లకు అందుబాటులోకి తేనుంది. వాట్సాప్​లో అత్యంత ఆదరణ పొందిన ఫీచర్​ వాయిస్​ కాల్​, వీడియో కాల్. మొబైల్​ డేటా లేదా వైఫై ద్వారా ఇతరులకు కాల్ చేసే సౌకర్యం ఈ ఫీచర్​ కల్పిస్తోంది.

అయితే కొత్త ఫీచర్​లో ఈ కాలింగ్ ఇంటర్​ఫేస్​ను అధునాతనంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దనుంది వాట్సాప్​. ప్రత్యేకించి గ్రూప్​ కాల్స్​ సమయంలో ఇంటర్​ఫేస్​ ఇంకా బాగా కన్పించనుందని సమాచారం. బాటమ్​లో ఉండే బటన్లు మాత్రం అలాగే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆండ్రాయిడ్​, ఐఓఎస్​ బీటా అప్డేట్​లో ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది.

మరో ఫీచర్​లో వాట్సాప్​ చాట్​, కాలింగ్​ ఎండ్​-టు-ఎండ్​ ఎన్​క్రిప్టెడ్​ అని తెలిసేలా యూజర్లకు కొత్త ఇండికేటర్లు కన్పించనున్నాయి. మొదట ఈ ఫీచర్​ను ఆండ్రాయిడ్ ఐఓఎస్ బీటా యూజర్లకు, ఆ తర్వాత అందరికీ అందుబాటులోకి తేనున్నారు.

కొత్త కమ్యూనిటీ క్రియేట్​ చేసే సదుపాయాన్ని కూడా వాట్సాప్ కల్పించనుంది. అడ్మిన్​.. కమ్యూనిటీ ఇన్వైట్​ లింక్​ ద్వారా సభ్యులను ఆహ్వానించవచ్చు. ఆ తర్వాత ఇతర సభ్యులకు సందేశాలు పంపొచ్చు. ఈ కమ్యూనిటీల ద్వారా ఒక గ్రూప్​లో మరో గ్రూప్​ను కూడా క్రియేట్​ చేసే సదుపాయం అడ్మిన్​కు ఉంటుంది. సాధారణ గ్రూప్​లకు, కమ్యూనిటీలకు తేడా స్పష్టంగా తెలిసేలా ఈ ఫీచర్​ను డిజైన్​ చేసింది.