వంట నూనెల ధరలు తగ్గనున్నాయా?

Will the prices of cooking oils go down?

0
88

దేశంలో వంట నూనెల ధరల మంటకు చెక్​ పెట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాపారుల వద్ద వంట నూనెలు, నూనె గింజల నిల్వలపై పరిమితిలు విధిస్తున్నట్లు తెలిపింది. దీనితో త్వరలోనే ధరలు సాధారణ స్థాయికి దిగిరావచ్చని ఆశాభావం వ్యక్తం చేసింది.

కేంద్రం తాజా నిర్ణయంతో వంట నూనెల ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. ఇది దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు ఊరట కలిగించే విషయం’ అని ఆహార, వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే కొంతమంది ఎగుమతి, దిగుమతిదారులకు మినహాయింపు ఇచ్చింది కేంద్రం. డైరెక్టర్​ జనరల్​ ఆఫ్​ ఫారిన్ ట్రేడ్​.. ఎక్స్​పోర్టర్​- ఇంపోర్టర్​ కోడ్​ ఇచ్చిన వారికి మాత్రమే ఈ మినహాయింపులు వర్తిస్తాయని పేర్కొంది.

చట్టపరమైన సంస్థలు ఏవైనా పరిమితికి మించి నిల్వలను కలిగి ఉంటే..ఆ వివరాలను ప్రజా పంపిణీ వ్యవస్థ పోర్టల్​లో పొందుపరచాలని కేంద్రం సూచించింది. రాష్ట్రాలు ఎప్పటికప్పుడు నూనెలు, నూనె గింజల పరిమిమతుల వివరాలని కేంద్రప్రభుత్వం వెబ్​సైట్​లో అప్​డేట్​ చేయాలని కోరింది. దేశీయంగా వంట నూనెల ధరలు కేవలం ఏడాది కాలంలో 46.15 శాతం పెరిగాయి. అంతర్జాతీయ కారణాలు, దేశీయంగా సరఫరా తగ్గటం వంటివి ఇందుకు కారణమని ప్రభుత్వం చెబుతోంది.