ఆ ఎమ్మెల్యే వేధిస్తున్నారు..మహిళా సర్పంచ్ ఆరోపణ

The MLA is harassing the woman sarpanch

0
48

నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తనకు వేధిస్తున్నాడని నల్గొండ జిల్లా యల్లమ్మగూడెం గ్రామ మహిళా సర్పంచ్ సంధ్య ఆరోపించారు. ఇందుకు గాను తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను కలెక్టర్ కు అందజేయడానికి వెళ్లగా ఆయన అందుబాటులో లేకపోవడంతో కలెక్టరేట్ ఏవోకు అందజేశారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ..ఎమ్మెల్యే వేధింపులు, ప్రభుత్వ ఒత్తిడితోనే రాజీనామా చేస్తున్నాని పేర్కొంది. తాను స్వతంత్య్ర అభ్యర్థిగా గెలిచి టిఆర్ఎస్ లో చేరకపోవడంతో ఎమ్మెల్యే కక్ష్య సాధింపు చర్యలు చేస్తున్నారు. గ్రామంలో చేసిన అభివృద్ధి పనులకు నిధులు రాకుండా అడ్డుకున్నారని తెలిపారు.