విండోస్ 11 అత్యంత సురక్షితం..ఎందుకంటే?

0
30

విండోస్ 11 అత్యంత సురక్షితమైనదని మైక్రోసాఫ్ట్ కంపెనీ పేర్కొన్నది. సాధారణ వినియోగదారులు విండోస్ 11 తో సరికొత్త అనుభూతితో పని చేస్తారు. రిఫ్రెష్ డిజైన్, రోజువారీ పనులను సులభతరం చేసే అనేక యాక్సెసిబిలిటీ ఫీచర్లను ఈ విండోస్‌ 11 కలిగి ఉంది. కొత్త విండోస్ వెర్షన్‌లో ప్రత్యేకించి కంప్యూటర్ నెట్‌వర్క్‌లో పనిచేసే కార్పొరేట్ క్లయింట్‌ల కోసం ప్రతి ఒక్కటి సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు.

కంప్యూటర్ ప్రారంభం కాగానే, అలాగే కంప్యూటింగ్ చేసేటప్పుడు ఉపయోగించే అనేక అప్లికేషన్లలో కూడా టీపీఎంలు హార్డ్‌వేర్ ఆధారిత సెక్యూరిటీ ఫంక్షన్లను అనుమతిస్తాయి. టీపీఎం 2.0 మార్కెట్‌కు కొత్తది. పరిమిత కంప్యూటర్లలోనే టీపీఎం 2.0 ఉంది.
అయితే టీపీఎం 1.2 కి మద్దతు ఇవ్వని అనేక భద్రతా చర్యలను విండోస్‌ 11 అందిస్తుంది. పాస్‌వర్డ్‌లో మరింత సురక్షితమైన ప్రత్యామ్నాయంగా పాస్‌వర్డ్‌లెస్‌ రక్షణను కూడా అందిస్తుంది. మైక్రోసాఫ్ట్ ఆథెంటికేరట్‌ యాప్‌, విండోస్‌ హెలో, ఫిజికల్‌ సెక్యూరిటీ కీస్‌ లేదా ఎస్‌ఎంఎస్ కోడ్‌లను ఉపయోగించి యాక్సెస్‌ అయ్యే ఫీచర్స్‌ దీనిలో ఇచ్చారు.