ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. అలానే ఆన్ లైన్ పేమెంట్స్ ని ఎక్కువగా చేస్తున్నారు. ప్రస్తుత కాలంలో ఫోన్ పే, గూగుల్ పే సాధారణమైపోయింది. ఎవరికైనా డబ్బులు పంపించలంటే సెకన్లలో పని అయిపోతుంది. బ్యాంకుకు వెళ్లి గంటల తరబడి నిలబడాల్సిన అవసరం లేదు. ఒక్క క్లిక్ తో డబ్బులు పంపించవచ్చు. ప్రస్తుత రోజుల్లో డిజిటల్ పేమెంట్స్ ఎక్కువయ్యాయి.
అయితే ఇంటర్‌నెట్ అవసరం లేకుండా కూడా యూపీఐ పేమెంట్స్ జరుపుకునే అవకాశం కూడా వుంది. పైగా ఈ ఫీచర్ ని ఉపయోగించుకోవాలంటే సింపుల్‌గా ఇలా పంపచ్చు. అయితే మరి ఇంటర్నెట్ లేకుండా యూపీఐ పేమెంట్స్ ని ఇలా చెయ్యచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలలోకి వెళితే..
దీని కోసం ముందుగా స్మార్ట్ ఫోన్‌లో *99# అని టైప్ చేయాలి.
ఆ తరవాత My Profile’, ‘Send Money’, ‘Receive Money’, ‘Pending Requests’, ‘Check Balance’, ‘UPI PIN’, ‘Transactions’ ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి.
మీరు ఎవరికైనా డబ్బులను సెండ్ చెయ్యాలంటే 1 నెంబర్‌ను ఎంచుకోవాలి.
ఇప్పుడు ఫోన్ నెంబర్, యూపీఐ ఐడీ, అకౌంట్ నెంబర్ నుంచి డబ్బులు పంపే ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది.
ఇప్పుడు పేమెంట్స్ మెథడ్ ఆప్షన్స్‌లో ఏదో ఒకటి సెలక్ట్ చేసుకోవాలి.
అలానే మీరు ఎవరికైతే డబ్బులు పంపించాలనుకుంటున్నారో వారి ఫోన్ నెంబర్ సెలక్ట్ చేసుకోవాలి.
అలానే అకౌంట్ నెంబర్ ని సెలక్ట్ చెయ్యాలి.
అకౌంట్ నెంబర్, యుపీఐ ఐడీని ఎంచుకుంటే ఐడీ నెంబర్‌ను ఎంటర్ చేయలి.
అమౌంట్ ని ఎంటర్ చెయ్యండి.
యూపీఐ పిన్ ఎంటర్ చేసి Send పై క్లిక్ చేస్తే చాలు.
తర్వాత ఎంత మొత్తం పంపాలనుకుంటున్నారో టైప్ చేయాలి.
గరిష్టంగా ఇలా రూ. 5 వేలు పంపాలి.