ముడి చమురు ధరలు పెరగడం ఆలస్యం చమురు కంపెనీలు ఆ భారాన్ని ప్రజలపై నేరుగా మోపాయి. మంగళవారం లీటరు పెట్రోలుపై 29 పైసలు, లీటరు డీజిల్‌పై 32 పైసల వంతున ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ.106.73లకు చేరుకోగా లీటరు డీజిల్ ధర రూ. 99.33గా ఉంది.