పండుగ పూట బీహార్‌లో తీవ్ర విషాదం నెలకొంది. వేడుకల్లో కల్తీ మద్యం తాగి ఇప్పటివరకు 11 మంది మరణించారు. ఈ ఘటన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సొంత జిల్లా నలందలో చోటు చేసుకోవడం గమనార్హం. కల్తీ మద్యం తాగి శనివారం ఆరుగురు మరణించగా.. ఆదివారం మరో ఐదుగురు మరణించడం కలకలం రేపుతోంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా.. ఈ ఘటనపై అధికారులు చర్యలు ప్రారంభించారు.