కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది ఏపీ వాసులు దుర్మరణం

-

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చిక్‌బళ్లాపూర్‌ వద్ద 44వ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని టాటా సుమో వావానం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13 మంది మరణించారు. ప్రమాద సమయంలో సుమోలో 14 మంది ప్రయాణికులు ఉన్నారు. దట్టమైన పొగ మంచు కారణంగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. వాహనం నెంబర్ ఆధారంగా మృతులను ఏపీ వాసులుగా గుర్తించారు.

- Advertisement -

శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన వారు బెంగళూరులోని హొంగసంద్రలో కూలీ పనులు చేస్తూ ఉంటారు. దసరా పండుగ సందర్భంగా సొంతూరు వచ్చారు. తిరిగి బెంగళూరుకు టాటా సుమోలో ప్రయాణమయ్యారు. అయితే పొగమంచు ఎక్కువగా ఉండటంతో డ్రైవర్‌.. రోడ్డుపై ఆగి ఉన్న ట్యాంకర్‌ గమనించకుండా వేగంగా ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో టాటా సుమో ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. వాహనంలో ప్రయాణిస్తున్న 14 మందిలో ఐదుగురు అక్కడిక్కడే చనిపోగా.. . 8 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో 9 మంది పురుషులు, ముగ్గురు మహిళలు, ఓ బాలుడు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘోర ప్రమాదంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏపీకి చెందిన శ్రీ సత్యసాయి జిల్లా వాసుల మృతి తీవ్రంగా కలచివేసిందన్నారు. మృతులంతా వ్యవసాయ కూలీలే కావడం బాధాకరమని.. వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి చెబుతూ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

మేమేం అభివృద్ధికి వ్యతిరేకం కాదు: ఓవైసీ

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కూల్చివేతలపై ఎంఐఎం అధినేత ఓవైసీ(Asaduddin Owaisi)...

భారత్ పర్యటనో మాల్దీవుల అధ్యక్షుడు..

మాల్దీవుల(Maldives) అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు.. భారత పర్యటనకు విచ్చేశారు. నాలుగు రోజుల...