బీజేపీలోనే ఉంటా.. పార్టీ మార్పు వార్తలను ఖండించిన డీకే అరుణ

-

పార్టీ మారుతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ(DK Aruna) స్పందించారు. తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ నాయకులు మైండ్‌ గేమ్‌ ఆడుతున్నారని.. ప్రధాని మోదీ నాయకత్వంలో పని చేసేందుకు అదృష్టం ఉండాలని వెల్లడించారు. బీజేపీ అధిష్టానం తనను గుర్తించి జాతీయ ఉపాధ్యక్ష పదవి ఇచ్చారని ఆమె తెలిపారు.

- Advertisement -

కర్ణాటక ఎన్నికల ఫలితాల ఇచ్చిన జోష్‌తో పాటు సర్వేలు కూడా కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా రావడంతో హస్తం కండువా కప్పుకునేందుకు నేతలు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన కీలక నేతలు మళ్లీ ఘర్ వావసీ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. తాజాగా మాజీ మంత్రి డీకే అరుణ సైతం కమలం పార్టీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అవుతున్నట్లు ప్రచారం జరిగింది. ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో పలు దఫాలుగా చర్చలు జరిపారని ఆ వార్తల సారాంశం. మక్తల్ లేదా దేవరకద్ర నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆమె రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను డీకే అరుణ తీవ్రంగా ఖండించారు.

2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోవడంతో ఇంకా తెలంగాణలో కోలుకోవడం కష్టమని భావించిన ఆమె బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఆ పార్టీ జాతీయ ఉపాధ్యాక్షురాలిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాగా గద్వాల నియోజకవర్గం నుంచి 2004, 2009, 2014 ఎన్నికల్లో డీకే అరుణ(DK Aruna) హ్యాట్రిక్ విజయం సాధించి వైయస్, రోశయ్య, కిరణ్‌ కుమార్ రెడ్డి మంత్రి వర్గాల్లో మంత్రిగా పనిచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Orange Benefits | శీతాకాలంలో నారింజ పండ్లు తింటే ఏమవుతుందో తెలుసా..!

Orange Benefits | శీతాకాలం అంటేనే ఎముకలు కొరికే చలి, కారుతున్న...

Rashmika | ‘సల్మాన్ చాలా కేర్ తీసుకుంటాడు’.. రష్మిక మందన

రష్మిక మందన(Rashmika).. పుష్ప-2తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుందీ ముద్దుగుమ్మ. ఈ...