Flash- దారుణం..ఐదేళ్ల బాలికపై 13 ఏళ్ల బాలుడు అత్యాచారం

13-year-old boy rapes five-year-old girl

0
86

ఉత్తర్​ప్రదేశ్​ గాజియాబాద్​లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఐదేళ్ల బాలికపై 13 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. గాజియాబాద్​లోని విజయ నగర్​ ప్రాంతానికి చెందిన ఓ చిన్నారి(5) తన సోదరుడితో కలిసి ట్యూషన్​ కోసం ఓ ఉపాధ్యాయుడి ఇంటికి వెళ్లింది. అయితే అక్కడ ఆ టీచర్​ లేడు. ఆ తర్వాత ఏదో పని కోసం బాలికను అక్కడే ఉంచి ఆమె సోదరుడు తమ ఇంటికి వెళ్లాడు.

ఆ సమయంలో ట్యూషన్ టీచర్​ కుమారుడు(13) సదరు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారి.. ఏడుస్తూ ఇంటికి వచ్చి తన తల్లికి విషయం చెప్పింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాలుడ్ని సంరక్షణ గృహానికి తరలించారు.