ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో కాల్పులు కలకలం రేపాయి. దేశ రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రముఖ షియా మతగురువు ముక్తాదా అల్-సదర్ ప్రకటించడం వల్ల ఆయన మద్దతుదారులు రెచ్చిపోయారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నిరసనకారులను నిలువరించేందుకు భద్రతా బలగాలు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 20 మంది మరణించగా, మరో వంద మంది గాయపడ్డారు.