ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. పెళ్లి బృందం బస్సు అదుపు తప్పి బోల్తా

-

ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బస్సు అదుపుతప్పి బోల్తా పడి ఐదుగురు దుర్మరణం చెందారు. 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం తీవ్రంగా గాయపడిన వారిని ఓరై మెడికల్ కాలేజీకి తరలించారు. జలౌన్ జిల్లా మడైల గ్రామం నుంచి పెళ్లి బృందం దూతవలి గ్రామానికి బస్సులో వెళ్లింది. అక్కడ వివాహం ముగించుకుని మడైల గ్రామానికి తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై యూపీ(Uttar Pradesh) సీఎం యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) స్పందించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు సరైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని యోగి ఆదిత్యానాథ్ ఆకాంక్షించారు.

- Advertisement -
Read Also: క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి హఠాన్మరణం

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sai Pallavi | ఉత్తమ నటిగా సాయిపల్లవి..

తమిళ చిత్ర పరిశ్రమ చాలా ప్రత్యేకంగా భావించే చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్...

High BP | హైబీపీ రాకూడదంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..

ప్రస్తుత పోటీ ప్రపంచంలో చిన్న వయసులోనే అనేక రకాల రుగ్మతలు వస్తున్నాయి....