100 అడుగుల లోయలో పడిన కారు..ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

0
119

ఇప్పటికే జరిగిన ఎన్నో రోడ్డు ప్రమాదాలలో చాలామంది తమ ప్రాణాలను కోల్పోగా.. ఉత్తరాఖండ్‌లో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భారీ ప్రాణనష్టం చవిచూడవలసి వచ్చింది. 100 అడుగుల లోతైన లోయలోకారు అదుపుతప్పి పడిపోవడం వల్ల ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు.

ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నైనితాల్ జిల్లాకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు చందన్ సింగ్ తన స్వగ్రామమైన బసేదాలో ప్రార్థనలు చేసిన తర్వాత కారులో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. ఇంకా ఈ ఘటనకు సంబంధించి పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.