Flash: అనుష్క శెట్టి సోదరుడి హత్యకు స్కెచ్..కారణం ఏంటంటే?

0
120

ప్రముఖ సినీ నటి అనుష్క శెట్టి ఇప్పటికే ఎన్నో సినిమాలు చేసి ఎనలేని గుర్తింపు సంపాదించున్నది. ముఖ్యంగా బాహుబలి సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ హీరోయిన్ కు గుణరంజన్ శెట్టి, రమేష్ శెట్టి అనే ఇద్దరు సోదరులు ఉన్నారు. అయితే ప్రస్తుతం అనుష్క శెట్టి కుటుంబానికి చెందిన ఓ వార్త కలకలం రేపుతోంది.

అనుష్క శెట్టి సోదరుడైన గుణరంజన్ శెట్టి హత్యకు మన్విత్ స్కెచ్ వేసినట్లు వార్తలు వస్తున్నాయి. కర్ణాటకలోని గ్యాంగ్ స్టర్ల మధ్య నెలకొన్న విభేదాలే దీనికి కారణమని పోలీసులు ప్రాధమికంగా నిర్దారించారు. మంగళూరుకు చెందిన మాఫియా డాన్ ముత్తప్పరై బతికున్నప్పుడు మన్విత్ రై, గుణరంజన్ శెట్టిలు కలిసి ఉండేవారు. కానీ ముత్తప్ప చనిపోయిన తర్వాత వీరిద్దరూ విడిపోగా..హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు సమాచారం తెలుస్తుంది.