కేంద్ర మంత్రి కొడుకు కారు హల్ చల్..ఇద్దరు రైతులు మృతి

0
110

కేంద్ర మంత్రి కుమారుడి కారు రైతులపైకి దూసుకెళ్లిన సంఘటనలో ఇద్దరు రైతులు చనిపోయారు. పలువురు రైతులు గాయపడ్డారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని లఖిమ్‌పూర్‌ ఖేరీలో ఆదివారం మధ్యాహ్నం జరిగింది.

కేంద్ర మంత్రి కుమారుడిని అదుపులోకి తీసుకోవాలంటూ రైతులు ఆందోళనకు దిగారు. ప్రమాదానికి కారణమైన కారుతో పాటు మరో రెండు కార్లకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు.

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని లఖిమ్‌పూర్‌ ఖేరీలో డిప్యూటీ సీఎం కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య ఒక కార్యక్రమానికి హాజరవుతున్న విషయం తెలుసుకున్న రైతులు నల్లజెండాలతో నిరసన తెలపాలని భావించారు. కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ రోడ్డుపై బైఠాయించేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో అతని కారు రైతులపైకి దూసుకొచ్చింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా తనయుడు ఆశీష్‌ మిశ్రా కారు నడుపుతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు.