అప్పుల బాధ తాళలేక చేనేత కార్మికుడు ఆత్మహత్య

0
88

రోజురోజుకు కార్మికుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఏపీలో విషాదం నెలకొంది. అప్పుల బాధ తాళలేక  చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల పరిధిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. దెయ్యాలకుంటపల్లి గ్రామానికి చెందిన దంపతులు సాదు ఆదినారాయణ రమాదేవి చేనేత వృత్తిపై ఆధారపడి జీవనం సాగించేవారు. మగ్గం నిర్వహణ నిమిత్తం రూ.మూడు లక్షల వరకు అప్పులు చేశారు. కరోనా నేపథ్యంలో చీరలకు డిమాండ్‌ తగ్గడం..వడ్డీల భారం అధికమైంది. కుటుంబ పోషణ, అప్పులు తీరే మార్గం లేక ఇంట్లోనే ఉరేసుకుని ఆదినారాయణ ఆత్మహత్య చేసుకున్నారు. మృతునికి నలుగురు కుమార్తెలు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.