Flash: వస్త్ర దుకాణంలో ఘోర అగ్నిప్రమాదం..రంగంలోకి ఫైర్ సిబ్బంది

0
139
Kabul

తెలంగాణాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నాగర్​కర్నూల్ జిల్లా కొల్లాపూర్​లో శివ క్లాత్​స్టోర్​లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో దుకాణం పూర్తిగా కాలిపోవడం వల్ల దాదాపు 60 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని షాపు యజమాని కంటతడి పెట్టుకున్నాడు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈఘటన  జరిగింది.

ఈ ప్రమాదం జరిగిన క్రమంలో షాపులో ఎవరు లేకపోవడం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం చేకూరలేదు. అనంతరం ఫైర్ సిబ్బందికి సమాచారం తెలియడంతో ఘటన స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేసారు. ఈ ఘటనలో మంటలు ఒక్కసారిగా ఎగిసిపడటంతో ప్రజలందరు భయాందోళనకు గురయ్యారు.