అమెరికాలో భారీ క్రికెట్ స్టేడియం నిర్మించనున్న బాలీవుడ్​ స్టార్​ హీరో..

0
78

స్టార్​ హీరో షారుక్​ ఖాన్​ బాలీవుడ్ లో మంచి సినిమాలు నటించి ఎనలేని గుర్తింపు సంపాదించుకున్నాడు. తనదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకులను అలరించాడు. ఐపీఎల్‌ జట్టైన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను కొనుగోలు చేయడం ద్వారా క్రికెట్‌ సంబంధిత వ్యాపారంలోకి ఎంట్రీ ఇచ్చి మొదటగా ఓ మంచి పనికి శ్రీకారం చుట్టడానికి సిద్దమయ్యాడు.

అమెరికాలోని లాస్​ ఏంజెల్స్​లో త్వరలోనే ఓ భారీ క్రికెట్‌ స్టేడియంను నిర్మించాలనే యోచనలో ఉన్నాడు. దీనివల్ల కోల్ కత్తా నైట్​ రైడర్స్​కు అంతర్జాతీయ గుర్తింపు వస్తుందని  ఆయన తెలిపారు. సుమారు పదివేల మంది సీటింగ్ కెపాసిటీతో ఈ పనికి సన్నాహాలు చేస్తునట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఆధునిక టెక్నాలజీతో ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు  పకడ్బందీగా చేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో అమెరికాలో క్రికెట్​ అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశ్యంతో ఎంఎల్సీతో కలసి భారీ పెట్టుబడులతో నిర్మిస్తున్నట్టు తెలిపారు.