పార్కులో పట్టపగలు కుక్కపై రేప్.. వీడియో వైరల్

-

కొందరు కామాంధులు ఎంత నీచానికి బరితెగిస్తున్నారో తెలిపే ఘటన ఇది. ఓ వ్యక్తి అందరూ ఛీత్కరించే చర్యకి పాల్పడ్డాడు. అది కూడా పట్టపగలు, ఎప్పుడూ జనసందోహం ఉండే ప్రదేశంలో. తన శారీరక వాంఛ తీర్చుకోడానికి ఆడకుక్కపై ఆటవికంగా ప్రవర్తించాడు. అతను చేసిన పని తెలిస్తే ప్రతి ఒక్కరూ పచ్చి బూతులు తిట్టకమానరు.

- Advertisement -

వివరాల్లోకి వెళితే.. పశ్చిమ ఢిల్లీలోని హరి నగర్ ప్రాంతంలోని ఒక పార్కులో ఆడ కుక్కపై అత్యాచారం చేసినందుకు పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. అరెస్టయిన వ్యక్తి ఆ ప్రాంతంలో నివాసముంటున్నాడని, అతనికి వివాహమై పిల్లలు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు.

నిందితుడు ఈ దారుణానికి పాల్పడుతుండగా, అతడిని ఎవరో వీడియో తీశారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి పోలీసులకు చేరింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత వారం ఫిర్యాదు అందింది. దీంతో అతనిపై భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 377, జంతు హింస చట్టంలోని సెక్షన్ల కింద ఆదివారం ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది.

ఆడ కుక్కతో అసహజ సెక్స్‌లో పాల్గొన్న వీడియో.. ఆ వ్యక్తికి సంబంధించిన వివరాలతో సహా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ క్లిప్ వైరల్ అవడంతో పలువురు ట్విట్టర్ యూజర్స్.. ఢిల్లీ పోలీసులను ట్యాగ్ చేస్తూ ఇలాంటి ఘటనలు జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించడం మొదలుపెట్టారు. దీనిపై ఢిల్లీ పోలీసులు స్పందిస్తూ ఈ విషయాన్ని తాము గుర్తించామని ట్వీట్ చేశారు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.

ఈ వీడియో ఆధారంగా నిందితుడి కోసం గాలింపు ప్రారంభించిన పోలీసులు నిందితుడిని గుర్తించారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. అయితే గతంలో కూడా ఇలాంటి చర్యలకు పాల్పడ్డాడా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

Read Also: ప్రాచీన ఆధ్యాత్మిక ప్రదేశాలు – ఆధునిక పేర్లు

Follow us on: Google News

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Bhupalpally | పురుగుల మందు తాగి జేసీబీ కిందపడ్డ రైతులు

తెలంగాణలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తమ భూములు లాక్కుంటున్నారని కొంతమంది రైతులు...