మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. నాందేడ్ లోని హిమాయత్ నగర్ లో సిమెంట్ లోడ్ తో వెళ్తున్న ట్రక్కు కూలీలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కూలీలు ఆక్కడికక్కడే మరణించగా..మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా ఈ ప్రమాదం శనివారం రాత్రి జరిగిందని సమాచారం.