నేడే IND vs AUS చివరి T20 మ్యాచ్..నిర్ణయాత్మక పోరులో గెలిచేదెవరు..ఇరు జట్ల బలాబలాలు ఇలా..

0
50

నేడు ఉప్పల్ లో జరగబోయే ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తొలి టీ20 మ్యాచ్ లో ఇండియా ఇచ్చిన భారీ టార్గెట్ ను ఆసీస్ అలవోకగా చేధించారు. వర్షం కారణంగా 8 ఓవర్లకు కుదించిన రెండో మ్యాచ్ లో ఇండియా బ్యాటర్లు దుమ్ములేపారు. చెరో విజయంతో సిరీస్ సమం అయింది. ఇప్పుడు నిర్ణయాత్మక మూడో మ్యాచ్ లో గెలవాలని ఇరు జట్లు తహతహలాడుతున్నాయి. నేడు హైదరాబాద్ లో రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల బలాబలాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

టీమిండియా బ్యాటింగ్:

208 మొదటి మ్యాచ్ లో టీమిండియా చేసిన స్కోరిది. ఇంతటి టార్గెట్ ఆసీస్ ఛేదిస్తారా అనేది అభుమానుల్లో సందేహం. కానీ ఇండియా పేలవ బౌలింగ్ ను ఆసీస్ ప్లేయర్లు ఆసరాగా చేసుకొని ఎదురుదాడికి దిగారు. రోహిత్, రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, పాండ్యా, దినేష్ కార్తీక్ ప్రస్తుతం ఫామ్ లో ఉన్న ఆటగాళ్లు. వీరు మరోసారి రాణిస్తే ఇండియాకు తిరుగుండదు.

బౌలింగ్ తోనే అసలు సమస్య:

బౌలర్లు రాణించకపోవడంతో మొదటి మ్యాచ్ చేజారింది. పేసర్లు భువి, హర్షల్ పటేల్ ధారాళంగా పరుగులు ఇస్తున్నారు. ఇక అక్షర్ పటేల్ ఆశించిన మేర రాణిస్తుండగా..చాహల్ పూర్తిగా విఫలమయ్యాడు. అయితే బుమ్రా జట్టుతో కలవడం కలిసొచ్చే అంశం. డెత్ ఓవర్లు ఇండియాకు మైనస్ గా మారాయి.  బౌలింగ్ లో లయ అందుకుంటే మాత్రం విజయం నల్లేరు మీద నడకే.

ఆసీస్:

ఫించ్, గ్రీన్, స్మిత్, డేవిడ్, మాక్స్ వెల్, వేడ్ ప్రమాదకరంగా మారనున్నారు. ఇక ఆసీస్ ను బౌలింగ్ సమస్య వెంటాడుతుంది. కమ్మిన్స్, హేజిల్ వుడ్, సామ్స్ త్రయం పూర్తిగా విఫలమయ్యారు. ఒక్క ఆడం జంపా మాత్రమే ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. నిర్ణయాత్మక మూడో టీ20 లో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి మరి.