అమీర్‌పేట మెట్రో స్టేషన్‌ పైనుంచి దూకిన యువతి

A young woman jumps from the top of Ameerpet metro station

0
100

హైదరాబాద్‌ అమీర్‌పేట మెట్రో స్టేషన్‌ వద్ద కలకలం రేగింది. స్టేషన్​ రెండో అంతస్తు నుంచి ఓ యువతి కిందకు దూకి ఆత్మహత్యకు యత్నించింది. దీనితో పక్కనే ఉన్న టింబర్​ డిపోలో పడిపోయింది. వెంటనే అప్రమత్తమైన మెట్రో సిబ్బంది 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు..యువతి టోలీచౌకికి చెందిన హీనా (20)గా గుర్తించారు. బీటెక్‌ చదువుతూ అమీర్‌పేటలోని హాస్టల్‌లో ఉంటున్నట్లు తెలిపారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు ఏమై ఉంటాయా అని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.