ప్రస్తుత రోజుల్లో చాలామంది ప్రేమలో విఫలమై ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. చేజేతులారా తమ ప్రాణాలను తామే బలితీసుకోవడంలో ముందడుగు వేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్ లో చోటు చేసుకుంది. కానీ అదృష్టవశాత్తు ఆమె కేవలం గాయాలతోనే బయటపడింది.ఈఎస్ఐ మెట్రో స్టేషన్ నుంచి కిందికి దూకి ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఓ యువతి.
ఆమెకు తీవ్ర గాయాలయ్యాయని గమనించిన స్థానికులు సమీప ఆస్పత్రికి తరలించారు. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ రామ్ నగర్ కు చెందిన షబానా అనే యువతిగా పోలీసులు గుర్తించారు. ప్రేమ విఫలం కావడంతో..ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు పోలీసులు గుర్తించారు. ఆమెను గమనించిన స్థానికులు వెంటనే ప్రైవేట్ అంబులెన్స్ లో గాంధీ హాస్పిటల్ కు తరలించారు.