తెలంగాణాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటికే జరిగిన ఎన్నో రోడ్డు ప్రమాదాలలో చాలామంది తమ ప్రాణాలను కోల్పోగా..తాజాగా నిజామాబాద్ జిల్లా చందూర్ శివారులో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం చవిచూడవలసి వస్తుంది. ఎంతో పట్టుదలతో చదువుకొని పరీక్షా కేంద్రానికి వెళుతుండగా ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
కారేగాం నుంచి బిర్కూర్‌కు పరీక్ష రాసేందుకు వెళ్తుండగా చందూర్ శివారులో కల్వర్టును బైక్ ఢీ ఢీకొట్టడంతో ఆ విద్యార్థి అక్కడిక్కడే మృతిచెందాడు. అనంతరం సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన గురించి తెలిసిన బాధితుడి తల్లిదండ్రులు కన్నీటిపర్యంతం అయ్యారు.