విషాదం..మొటిమ‌లు త‌గ్గ‌డం లేద‌నే కారణంతో నిండు ప్రాణం బలి..

0
118

ఈ మధ్యకాలంలో చాలామంది యువతీ, యువకులు చిన్న చిన్న కారణాలతో తమ ప్రాణాలను తామే బలితీసుకోవడానికి కూడా వెనుకాడడం లేరు. ఇప్పటికే ఇలాంటి ఘటనల కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా..తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే వారి కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది.

వివరాల్లోకి వెళితే..ఉత్తరప్రదేశ్‌లోని బందా జిల్లా బిసంద పోలీస్ స్టేషన్ పరిధిలోని అజిత్‌పారా గ్రామంలో ఓ యువతీ తీసుకున్న నిర్ణయానికి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇటీవల తనకు పెళ్లి సంబంధాలు చూడగా..తన ముఖంపై అధికంగా మొటిమలున్నాయనే కారణంతో తనను అందరు రిజెక్ట్ చేస్తున్నారని ఈ ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం తెలుస్తుంది.

ఈ కారణంగానే తీవ్ర మనస్తాపానికి గురైన యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుందని అంటున్నారు. దాంతో పోలీసులు బాధితురాలు కుటుంబ సభ్యుల వివరాల మేరకు కేసు నమోదు చేసారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చరీకి తరలించామన్నారు.